బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం: 18 కోట్ల ఆస్తి నష్టం

Fire-accident

నల్గొండ జిల్లా బీబీనగర్ లోని శ్రీయం అగ్రోకెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ ఆవరణలో మిసైల్ ట్యాంకర్ ను అన్ లోడ్ చేస్తుండగా స్పార్క్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే చౌటుప్పల్, బీబీనగర్ ల నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో సుమారు 18 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశామని ఆర్డీవో తెలిపారు. భువనగిరి రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బీబీనగర్ పట్టణానికి ఈ కంపెనీ ఆనుకుని ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పరిసర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.