బీసీలకు రాజ్యాధికారం టిడిపితోనే సాధ్యం : చంద్రబాబు

హైదరాబాద్, సెప్టెంబర్, 6: బిసీలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బిసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. అనంతరం చట్టసభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

చేతి వృత్తి కార్మికులు మరణిస్తే 5 లక్షలు, గాయపడితే లక్ష వరకు పరిహారం చేల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్య్సకారులకు డీజిల్ పై సబ్సిడీ ఇస్తామని, అదే విధంగా ఉచితంగా బియ్యం, ఆహారసదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. కుల వృత్తులపై విధించిన పన్నులను పూర్తిగా రద్దు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చేతి వృత్తిదారులకు శిక్షణ, నిబంధనల ప్రకారం నిధులు కేటాయించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.