బీసీసీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గవాస్కర్

BCCI-president

ఐపీఎల్-7 నిర్వహణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఐపీఎల్ టోర్నీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ (తాత్కాలిక అధ్యక్షుడు)గా గవాస్కర్ వ్యవహరిస్తారని ప్రకటించింది. గవాస్కర్ ఈ హోదాలో ఉన్నన్ని రోజులు క్రికెట్ కామెంటేటర్ గా ఉండరాదని షరతు విధించింది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నీలో పాల్గొనవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోర్నీలో ఆడకుండా ఏ ఆటగాడిపై నిషేధం విధించడం లేదని స్పష్టం చేసింది. దీంతో, ఐపీఎల్-7కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే బీసీసీఐ ఉపాధ్యక్షులుగా ఉన్న ఐదు మందిలో ఎవరో ఒకరు బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించడానికి కోర్టు అనుమతించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.