బొత్స ఒక లిక్కర్ డాన్: చంద్రబాబు

chandrababu-naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజాగర్జన సభలో ఆవేశభరితంగా ప్రసంగించారు. ఒక కుటుంబ పెద్దగా అందరి సమస్యలను తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే బాధ్యత టీడీపీది అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సామాన్యుడు కడుపునిండా తినలేని పరిస్థితి నెలకొందని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని విమర్శించారు. దీపం పథకాన్ని కాంగ్రెస్ దొంగలు ఆర్పేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వేయి నుంచి రెండు వేల రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. బొత్స ఒక లిక్కర్ డాన్ అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ఊరికొక అనకొండను తయారుచేసి వదులుతోందని విమర్శించారు.

పార్లమెంటులో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ హయాంలో టీడీపీ సహకారంతో వాజ్ పేయి ప్రధాని కాగలిగారని మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పేది టీడీపీనే అని చెప్పారు. కాంగ్రెస్ కు జగన్ దత్తపుత్రుడని, కేసీఆర్ అద్దె పుత్రుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. పేదవారికి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే అని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ కు ఎవరు చెప్పారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగైందని తెలంగాణలో బలపడలేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో సీమాంధ్రను, తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేది టీడీపీనే అని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.