బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి

హైదరాబాద్, అక్టోబర్ 14: రంగారెడ్డి జిల్లా జిల్లా మంచాలలో విషాదం నెలకొంది. బోరు బావిలో పడిన గిరిజ (5) మృత్యువాత పడింది. గిరిజ మృతితో ఆమె బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అమ్మమ్మతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన గిరిజ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. గిరిజను ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి గత మూడు రోజులుగా రెస్క్యూ బృందాలు చేసిన ప్రయాత్నాలన్నీ విఫలమయ్యాయి. బాలికను రక్షించేందుకు 4 జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా 45 అడుగుల లోతులో గొయ్యి తవ్వుతుండగా రాయి తగలడంతో ముందుకు వెళ్లలేకపోయారు. గిరిజ మరణవార్త తెలియగానే గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.