బ్యాంకు సిబ్బంది దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్, నవంబర్ 12: వేతన సవరణ కోరుతూ పబ్లిక్ రంగ బ్యాంకుల యూనియన్ల చేపట్టిన సమ్మెతో ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాలు, జిల్లాల్లోనూ ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు.

హెచ్ డీ ఎఫ్ సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేస్తున్నాయి. చెక్కుల క్లియరెన్స్, నగదు జమ తదితర పనుల విషయంలో కొంతవరకు ఖాతాదారులు ఇబ్బంది పడినా, ఏటీఎంలు పనిచేస్తుండడంతో సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. పలుచోట్ల బ్యాంకు ఉద్యోగులు తమ తమ కార్యాలయాల ఆవరణలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.