భద్రాచలం ముమ్మాటికీ సీమాంధ్రదే

Kishore Chandra Deo

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ వారు భద్రాచలం మాకంటే మాకే చెందుతుందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలం డివిజన్ ముమ్మాటికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందినదేనని కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ భద్రాచలం సీమాంధ్ర ప్రాంతానికి చెందినదేనని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లును వెనక్కి పంపడం సరికాదని కిషోర్ చంద్రదేవ్ అన్నారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిపి మార్పులు చేయాలని ఆయన సూచించారు. కొండ కుమ్మరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.