భాజపాలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

హైదరాబాద్, నవంబర్ 5: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా మట్లాడుతూ మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షతులై బిజేపి లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బిజేపి బలపడడానికి ఒక కార్యకర్తగా పనిచేస్తానని కన్నా పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏర్పడ్డ శూన్యాన్ని భర్తీ చేసే బాధ్యత భారతీయజనతా పార్టీమీద పడిందని ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేస్తామనే నాయకులకు ఆయన ఆహ్వానం పలికారు. బిజేపిని రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దడంలో తప్పకుండా వారి అందరి సహకారం తీసుకుంటామన్నారు. మరోక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేయడంకోసం బిజేపిని బలోపేతమైన శక్తిగా రాష్ట్రంలో తయారుచేస్తామని హరిబాబు పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.