భారత్ ఘన విజయం

cricket-15

అడిలైడ్: పాకిస్థాన్‌తో గ్రూప్‌-బి పోరులో భాగంగా అడిలైడ్‌ మైదానంలో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ధోనీసేన 76 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 300 పరుగులు చేసింది. భారత్ జట్టులోని విరాట్‌ కోహ్లీ 126 బంతుల్లో, 8 ఫోర్లతో 107 పరుగులు సాధించాడు. అదే విధంగా శిఖర్‌ ధవన్‌ 76 బంతుల్లో 73, సురేష్‌ రైనా 56 బంతుల్లో 74 పరుగులు సాధించారు. పాక్‌ బౌలర్లలో సొహైల్‌ ఖాన్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలిపోయింది. కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ 84 బంతుల్లో 76 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. అహ్మద్‌ షెహజాద్‌ 47, హారిస్‌ సొహైల్‌ 36 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి నాలుగు, ఉమేష్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. వరల్డ్‌ కప్‌ లో పాక్‌పై సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కిన కోహ్లీకే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.