భారత్ మాతాకీ జై

న్యూయార్క్: ఆదివారం న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద ఏర్పటుచేసిస విస్తృతమైన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక గంట పాటు తన ప్రసంగంతో ఔత్సాహికులైన ప్రవాసభారతీయులను హావభావాలతో కట్టిపడేశారు.

మోదీ నామస్మరణతో మేడిసన్  స్క్వేర్  లోపలా, బయటా  హోరెత్తిపోయింది.  దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పరోక్షంగా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. “భారత్ మాతాకీ జై“ అని ప్రారంభిస్తూ సహజమైన హావభావాలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. భారత శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగిన మోదీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. భారత శక్తియుక్తులను, తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే, మాతృదేశాన్ని అభివృద్ధి చేయడానికి కలిసిరావాలంటూ ప్రవాసులందరికీ ప్రధాని మోదీ పదేపదే పిలుపునిచ్చారు.

modi_madison 2“అహ్మదాబాద్‌లో ఆటో చార్జీ కిలోమీటర్ కు రూ 10 వసూలు చేస్తున్నారు. ఇస్రో అంగారక గ్రహం మీదకు ఉపగ్రహాన్ని పంపడానికి కిలోమీటర్ కు రూ 7 ఖర్చయింది. తొలి ప్రయత్నంలోనే మార్స్ ను చేరిన మొదటి దేశం కూడా భారతే“ అన్నారు. హాలీవుడ్ సినిమాకయ్యే వ్యయం కన్నా తక్కువలోనే తొలి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపించాం. మన నైపుణ్యానికి ఇదే నిదర్శనం.

“నేను పేదవాణ్ని, చాలా చిన్న వాణ్ని అందుకే చిన్న ఆలోచనలే చేస్తాను“. చిన్న చిన్న వారి కోసం పెద్దపెద్ద పనులు చేస్తాను అని మోదీ అన్నారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛభారత్, అందరికీ ఇళ్లు, మేకిన్ ఇండియా వంటి పథకాల ఆవశ్యకతను వెల్లడించారు. దేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో విస్తరించినప్పటికీ ఇంకా 50 శాతం మంది కుటుంబాలకు ఖాతాలు లేవు. అందుకే జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించాం. కొద్ది వారాల్లో నాలుగు కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచాం. అందులో 15000 కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చాయి. ఇదీ సామాన్యుడి జీవితంలో మార్పును తెచ్చేదే అని చెప్పారు.

Madison_audienceమోదీ ప్రసంగిస్తున్నంత సేపూ సభికులు మోదీ… మోదీ…. నినాదాలతో స్టేడియంను దద్దరిల్లేట్లు చేశారు. కాషాయ రంగు జాకెట్, పసుపు పచ్చ కుర్తా వేసుకొని గుండ్రంగా తిరిగే వేదికపై కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో మోదీ ప్రసంగం కన్నుల పండువగా సాగింది. చివర్లో “భారత్ మాతాకీ జై“ అని సభికులందరితో అనిపించి ప్రసంగాన్ని ముగించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.