భారత గెలుపు: రాణించిన మిథాలీ, స్రవంతి

కాక్స్ బజార్: టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (64 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు)… బౌలింగ్‌లో స్రవంతి నాయుడు (4/9) రాణించడంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.

పూనమ్ రౌత్ (46 బంతుల్లో 42; 2 ఫోర్లు) అండతో రెండో వికెట్‌కు అజేయంగా మిథాలీ 98 పరుగులను జోడించింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్రవంతి నాయుడు 3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా… హైదరాబాద్ బౌలర్ గౌహర్ సుల్తానా (2/11)… బెంగాల్ పేసర్ జులన్ గోస్వామి (2/14) రెండేసి వికెట్లు పడగొట్టారు. స్రవంతి నాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండో వన్డే ఇదే వేదికపై 11న జరుగుతుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.