భీమవరంలో ‘భీమవరం బుల్లోడు’ ఆడియో రిలీజ్

Beemavaram-bullodu

సునీల్ కథానాయకుడిగా నటించిన భీమవరం బుల్లోడు ఆడియో రిలీజ్ వేడుక భీమవరంలో జరిగింది. డాక్టర్ రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా రవి, లాస్య వ్యవహరించారు.

మాటీవీ మ్యూజిక్ ఛానల్ లో ఉదయం ప్రసారమయ్యే ‘సమ్ థింగ్ స్పెషల్’ లో వీరు వీక్షకులకు చిరపరిచితులే. ఈ ఆడియో వేడుకలో టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ కు డ్యాన్సర్లు హుషారుగా నృత్యం చేశారు. హీరో సునీల్, హీరోయిన్ ఎస్తేర్, నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు ఉదయశంకర్, పాటల రచయిత చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.