భూసమీకరణకు శ్రీకారం

హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచే రెవెన్యూ బృందాలు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తాయి. ఇందుకోసం డిప్యూటి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ఈ బృందంలో ఇద్దరు తహశీల్దారులు, ఇద్దరు డిప్యూటి తహశీల్దార్లు, సర్వేయర్లు ఉంటారు. ఒక్కో బృందం ఒక్కో పరిధిలో భూ సమీకరణ జరుపుతుంది. 14 వందల ఎకరాలకు ఒక బృందం పనిచేస్తుంది. భూ సేకరణలో పాల్గొనే రెవిన్యూ అధికారులతో సీఆర్ డీఏ కమీషనర్ శ్రీకాంత్ సమావేశమయ్యారు. వారికి భూసేకరణ గురించి వివరించారు. ఎవరి దగ్గర భూములు బలవంతంగా తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.