మంత్రి జగదీశ్ రెడ్డి పై ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం : పొన్నం

ponnan prabhakar-4

హైదరాబాద్: తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి కెేసిీఆర్ పై కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. మంత్రి జగదీశ్ రెడ్డి పై ఆరోపణలు చేసినందుకు తనను దారిన పోయే దానయ్య అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పొన్నం విరుచుకపడ్డారు. మంత్రి జగదీశ్ రెడ్డి పై చేసిన ఆరోపణలు తప్పని రుజువు చేయాలని  ముఖ్యమంత్రి కెేసిీఆర్ కు సవాల్ విసిరారు. తన ఆరోపణలు తప్పో, ఒప్పో తేల్చేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి కి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పై తాను చేసిన ఆరోపణలకు కట్టబడి ఉన్నానని తెలిపారు. ఆరోపణలు తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్దమని పొన్నం పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజల వద్ద వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తే, ఆ కమిటీని ఆధారాలను అందజేసేందుకు సిద్దమన్నారు. రాజయ్యకు ఒక న్యాయం, జగదీశ్ రెడ్డి కి మరో న్యాయమా అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. బలహీనులే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారని పొన్నం ఎద్దేవా చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.