మణిపూర్ లో చొచ్చుకు వచ్చిన మయన్మార్

మణిపూర్ లో చొచ్చుకు వచ్చిన మయన్మార్

ఢిల్లి : మయన్మార్ సైన్యం మణిపూర్ లోకి చొచ్చకు వచ్చనట్లు తెలుస్తోంది. మణిపూర్ లోని మోర్ సెక్టార్ లో భారత సరిహద్దు దాటి మయన్మార్ దళాలు లోపలికి చొచ్చుకు వచ్చాయని, అక్కడ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని వార్త. జమ్ము కశ్మీర్ లో పాకిస్తాన్, చైనాల చొరబాటు సమస్య ఎదుర్కుంటున్న భారత్ ఇప్పుడు సరికొత్తగా మయన్మార్ తో సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. మయన్మార్ సైన్యం రెండు రోజుల క్రితమే మోర్ సెక్టర్ లోకి చొచ్చకువచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంతం ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. మయన్మర్ లో ఉన్న భారత రాయబారి ఈ విషయమై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.