మనసుంటే మార్గం ఉంటుంది : ఈటెల రాజేందర్

హైదరాబాద్, నవంబర్ 11: ఆర్ధిక, సామాజిక, విద్య, వైద్య, ఉద్యోగ, ఇలా అనేక విషయాలమీద సమాచారం సేకరించడం కోసమే సమగ్ర సర్వే చేపట్టామే తప్పా సంకుచితమైన ఆలోచనలతో సర్వే జరపలేదని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాలలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు ఈటెల సమాధానమిచ్చారు. అనేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడు సాధ్యమైతుందా  అని అందరూ అనుకున్నారు. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. చేయాలని తపన ఉంటే సాధ్యమవుతుంది అని ఈటెల అన్నారు. ప్రజలకు రాజకీయపార్టీలు, రాజకీయ నాయకుల మీద విశ్వాసం తగ్గిపోతన్న ఈ సందర్భంలో మళ్లీ ఆ విశ్వాసాన్ని పొందే కర్తవ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో 95 శాతం సమగ్రమైన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరించామన్నారు. గత 57 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకం ఏదైతే కోల్పోయిందో దానిని అందించడానికి చేసిన రూపకల్పనే ఈ సమగ్రసర్వే అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమగ్ర సర్వేతో అందరూ ఒక చోట కలుసుకోవడం ద్వారా వారు గత స్మృతులను గుర్తుచేసుకున్నారని తెలిపారు. సర్వే వల్ల తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. విపక్షాలు మంచిని ప్రశంసించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదని ఈటెల తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.