మన్మోహన్ కు జపాన్ పురస్కారం

హైదరాబాద్, నవంబర్ 5: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు జపాన్ ప్రభుత్వం ఆ దేశ ఉత్తమ పురస్కారాల్లో ఒకటైన `గ్రాండ్ కార్టన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోవినియా ప్లవర్స్` అవార్డును అందించింది. టోక్యోలోని రాజప్రసాదం ఇంపీరియల్ భవనంలో జపాన్ చక్రవర్తి అఖితో పతకం ప్రదానం చేశారు. భారత్, జపాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడానికి అందించిన సేవలకు గాను మన్మోహన్ కు జపాన్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించినట్లు పేర్కొంది. భారత్ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి మన్మోహన్ సింగ్. మన్మోహన్ ఈ అవార్డును అందుకున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ టిట్టర్ లో మన్మోహన్ కు అభినందనలు తెలిపారు.

 

modi twitter-congrato manmohan

Have something to add? Share it in the comments

Your email address will not be published.