మన్మోహన్ సింగ్ కు అండగా ఏఐసీసీ

sonia-manmohan-rally-aicc-12

హైదరాబాద్: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తో చర్చించిన అనంతరం సభ్యులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు సంఘీభావం ప్రకటించారు.

ఏఐసీసీ కార్యాలయం నుంచి సోనీయాగాంధీతో పాటు సీనియర్ నేతలు వీరప్పమొయిలీ, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఏకే ఆంటోనీ తదితరులు మన్మోహన్ సింగ్ ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ నిజాయితీకి మారుపేరని, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసన్నారు. అటువంటి మన్మోహన్ కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామని సోనియా తెలిపారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని సోనియా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.