మన్మోహన్ సింగ్ ను అభినందించిన సోనియా, రాహుల్

హైదరాబాద్, నవంబర్ 8: జపాన్ ప్రభుత్వ ఉత్తమ పురస్కారాల్లో ఒకటైన `గ్రాండ్ కార్టన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోవినియా ప్లవర్స్` అవార్డును అందుకున్న భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే తదితరులు మన్మోహన్ సింగ్ కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. టోక్యోలోని రాజప్రసాదం ఇంపీరియల్ భవనంలో జపాన్ చక్రవర్తి అఖితో చేతులమీదుగా ఈ నెల 5న మన్మోహన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత్, జపాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడానికి అందించిన సేవలకు గాను మన్మోహన్ కు జపాన్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.