మమతా బెనర్జీకి అన్నాహజారే మద్దతు

mamata-anna-hazare

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే అంశాల వారీగా మద్దతు ప్రకటించారు. తృణమూల్ కార్యాలయానికి వెళ్లి మమత బెనర్జీతో అన్నాహజారే విస్తృత సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో త్వరలో వారిద్దరి ఆధ్వర్యంలో ‘ఫైట్ ఫర్ ఇండియా’ ప్రచార కార్యక్రమం జరగనుంది.

ఈ సందర్భంగా అన్నాహజారే మాట్లాడుతూ.. మమత ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న నాయకురాలని ప్రశంసించారు. ఆమె దేశానికి, సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు. మమత సిద్ధాంతాలను మాత్రమే తాను సమర్థిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమె నిరాడంబర జీవితం గడుపుతున్నారని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.