మరోసారి వాయిదాపడిన ‘రేయ్’ ఆడియో

Rey-Movie-Stills

సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ‘రేయ్’ మూవీ ఆడియో ఫంక్షన్ మరోసారి వాయిదాపడింది. ఈ సినిమా ఆడియో వేడుక జనవరి 5న విడుదల కావలసివుండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ‘రేయ్’ మూవీ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తున్న విషయం పవన్ అభిమానులందరికీ తెలియడంతో ఆడియో ఫంక్షన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అందులోను సాయిధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో డ్యాన్సర్ పాత్రని సాయిధరమ్ తేజ్ పోషిస్తున్నాడు.

ఈ సినిమాకి వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం మరియు నిర్మాతగా వహిస్తున్నాడు. వై.వి.ఎస్ చౌదరి నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వున్నారు. ఈ సినిమాపై చౌదరి చాలా ఆశలే పెట్టుకున్నాడు. రేయ్ చిత్రానికి చక్రీ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా షూటింగ్ లో చాలా భాగం హైదరాబాద్, బ్యాంకాక్, అమెరికా, కరేబియన్ దీవులలో తీశారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.