మలేషియాతో భారత్ సెమీస్ నేడే

మలేషియాతో భారత్ సెమీస్ నేడే

ఆసియాకప్ హాకీలో భారత్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసి సెమీస్ చేరుకుంది. నేడు జరిగే సెమీస్ లో మలేషియాతో భారత్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ అయినప్పటికీ సంచలనాలు సృష్టించే సత్తా మలేషియాకు ఉందని మరువరాదు. వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత్ సెమీస్ గెలిస్తే 2014లో నెదర్లాండ్స్ లోని హేగ్ లో జరిగే ప్రపంచకప్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ భారత్ సెమీస్ లో ఓడినా, పాకిస్తాన్ కూడా విజేతగా మారకపోతే ప్రపంచకప్ కు వెళ్ళే అవకాశం మనకు లభిస్తుంది. దక్షిణ కోరియా, మలేషియా జట్లలో ఏ జట్టు టైటిల్ గెలిచినా భారతజట్టు ప్రపంచకప్ కు వెళ్ళే అవకాశం ఉంటుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.