మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

kcr-komarelli-21

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వరంగల్ జిల్లాలోని కొమరవెల్లి శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున మల్లిఖార్జున స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కొమరవెల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ విముక్తి కోసం నిలబడ్డ పోరాట యోధుడన్నారు.  ఆయన పేరు మీద హైదరాబాద్ లో ప్రత్యేక భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రభుత్వం తరఫున ఎకరం లేదా ఎకరన్నర స్థలం కేటాయించడంతోపాటు, భవన నిర్మాణం కొరకు రూ 5 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.

కొమరవెల్లి మల్లన్న కళ్యాణోత్సవంలో  కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి రాజయ్య, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు హాజర్యయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.