మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన గవర్నర్

Mahatma-gandhi

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపూఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, తదితరులు కూడా బాపూఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ భారత దేశానికి జాతిపిత ఎనలేని సేవలు చేశారని, అహింసా మార్గంలో తాను పయనించడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన జాతిపిత సేవలను కొనియాడారు. స్వాతంత్ర సమరంలో మహాత్మ కృషి ఎనలేనిదని నరసింహన్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.