మహారాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్

Devendra Fadnavisముంబాయి, అక్టోబర్ 28: మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఫడ్నవిస్ ని తమ నేతగా ఎన్నుకున్నారు. సభ్యుడు ఏక్ నాథ్ ఖడ్సే శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దాంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. భాజపా ప్రతినిధుల బృందం కాసేపట్లో గవర్నర్ సి.విద్యాసాగర్ రావుని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనుంది. నాగ్ పూర్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ విజయం సాధించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.