మహిళలు రాత్రి ఉద్యోగాల్లో పనిచేసుకోవచ్చు: గుజరాత్ హైకోర్టు

మహిళలు రాత్రి ఉద్యోగాల్లో పనిచేయడానికి వీల్లేదనడం రాజ్యాంగ విరుద్ధమని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇది మహిళల ప్రాథమిక హక్కుపై నియంత్రణగా పేర్కొంది. గుజరాత్ లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్యాక్టరీల్లో మహిళలు పనిచేయకుండా నిషేధించే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ భాస్కర్ భట్టాచార్య ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ నిబంధనను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.