మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత : ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అర్ధరాత్రి సైతం స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళా భద్రత, రక్షణ కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై ఆయన శనివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అఘాయిత్యాలు, నేరాలు జరిగితే అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ తెలిపారు. దీనికోసం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటుచేసి, సొంత భవనం నిర్మించడంతోపాటు వాటికి నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కమిటిలో ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, అధ్యయన కమిమీ చైర్యన్ పూనం మాలకొండయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 62 పేజీల్లో ఉన్న ఈ నివేదికలో మహిళల రక్షణకు 82 సిఫార్సులు చేసింది. వారి నివేదిక మర్గదర్శకంగా ఉందని ప్రశంసించారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరిగితే సంబంధిత శాఖాధిపతులే బాధ్యత వహించేలా ఉత్తర్వులు జారీచేస్తామని సిఎం వారి తెలిపారు.

సమాజంలో మహిళలను గౌరవించే సంస్కృతి రావాలన్నారు. మహిళలను అసభ్యంగా చూపించే దృశ్యాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా రక్షణకు 24 గంటలు పనిచేసే హెల్ప్‌ సెంటర్ ఏర్పాటు, మహిళా పోలీస్ స్టేషన్లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉండాలని సూచించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపే కార్యక్రమాలకు, సీరియళ్లు, సినిమాలకు అవార్డులు ప్రదానం చేయాలని సూచించారు.

ఈవ్ టీజింగ్, యాసిడ్ దాడులవంటి బహిరంగ హింసాత్మక సంఘటనలకు కారణాలను విశ్లేషించి, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు రూపొందించడానికి సిద్ధమని సిఎం కేసీఆర్ తెలిపారు. పోలీసుల్లో 33 శాతం మహిళలను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, పురుషుల మధ్య గ్రిల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మహిళల పట్ల సమాజంలో మార్పు రావాలని, వారి భద్రతపై ప్రసార మాధ్యమాల్లో చైతన్య కార్య్రకమాలు చూపడతామని చెప్పారు. ఇటీవల సింగపూర్ సందర్శనలో మహిళా భద్రత కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించామని, కమిటీ అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించి రావాలని సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.