మహేష్ బాబు ‘ఆగడు’ షూటింగ్ వీడియో లీక్

Aagadu-movie

మహేష్ బాబు ‘ఆగడు’ షూటింగ్ వీడియో లీకైంది. దీంతో మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ సూపర్ హిట్టవ్వడంతో ‘ఆగడు’ కూడా సూపర్ హిట్టేనని మహేష్ బాబు అభిమానులు ఫిక్సైపోయారు. ఈ దశలో ‘ఆగడు’ సినిమా షూటింగ్ వీడియో బళ్లారిలో లీకైంది. వీడియోలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుండగా మహేష్ బాబు పవర్ ఫుల్ గా నడుచుకుంటూ వచ్చే సన్నివేశం ఉంది. ఇప్పటి వరకు ‘ఆగడు’కు సంబంధించిన ఏ ఒక్క చిన్న ఫొటో వెలువడకపోవడం, ఒక్కసారిగా మహేష్ బాబు షూటింగ్ వీడియో లీకవ్వడంతో ‘ఆగడు’పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండడం విశేషం. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.