మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత

ప్రముఖ మాండోలిన్ విధ్వాంసుడు ఉప్పాలపు శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన  చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తి పేరు  ఉప్పాలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధి చెందారు. 1998లో పద్మశ్రీ అవార్డు, 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న శ్రీనివాస్‌ దేశంలోనే మాండోలిన్‌ విధ్వాంసుల్లో ప్రముఖుడిగా పేరు గడించారు. అతిచిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అనేక కచేరీలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.