మామ్ ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: భారత అంతరిక్ష పరిశోధనలో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. బెంగళూరులోని ఇస్ట్రాక్ ప్రాంగణంలో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. మామ్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన ప్రపంచ దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.