మార్చి 28న ‘లెజెండ్’..!

Legend-walls

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘లెజండ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మార్చ్ 28న ప్రపంచ వ్యాప్తంగా దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కాగా, మరోపక్క మార్చ్ 7న ఈ సినిమా ఆడియోను వైభవంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని శిల్పకళావేదిక ఆడిటోరియంలో మార్చి 7న సాయంకాలం అభిమానుల సమక్షంలో పాటల పండుగ జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, మహాశివరాత్రి సందర్భంగా తాజాగా LION IS BACK పేరిట విడుదల చేసిన ఈ సినిమా వాల్ పేపర్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.