`మా` అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ విజయం

rajendra-prasad-17

హైదరాబాద్ : సినీ కళాకారుల సంఘం `మా` అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. తనపై పోటీ చేసిన జయసుధ మీద ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గత నెల 29న జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 702 మంది సభ్యులకు గాను 394 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన సమీప ప్రత్యర్ధి జయసుధపై 85 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో రాజేంద్రప్రసాద్ అభిమానులు, ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.