మిల్కీ బ్యూటీ తమన్నా బర్త్ డే

ఈ తరం కథానాయికల లో “మిల్క్ వైట్ బ్యూటి” గా పేరొందిన ఒకే ఒక తార తమన్నా. ఈ తార శనివారం తన 22 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. 1989 డిసెంబర్ 21 న మహా రాష్ట్ర లో సింది కుటుంబం లో జన్మించిన తమన్నా తన చిన్నతనాన్ని ముంబై లో గడిపింది. “శ్రీ” చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం అయ్యింది. కాని తన మొదటి విజయం శేకర్ కమ్ముల చేసిన “హ్యాపీ డేస్” చిత్రం తో వచ్చింది.

ఈ చిత్రం తో తెలుగు ప్రజలకి బాగా చేరువయ్యింది. తమన్నా తమిళ పరిశ్రమ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. స్నేహభావము మరియు కష్టపడే తత్వం తనని ఈ స్థాయికి తీసుకు వచ్చింది. తను తెలుగు బాగా మాట్లాడగలదు. ఈ సం‏‏‏దర్భంగా ‘సకలం’ తరపున తమన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.