మిస్డ్ కాల్ తో వేధిస్తే జైలుకే

పాట్నా : మహిళలకు మిస్డ్ కాల్ చేయడం ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. దీని వల్ల మహిళల అభద్రతకు లోనుకావడంతో పాటు మనశ్శాంతిని కోల్పోతున్నారు. మహిళలను అవహేళన చేసేవిధంగా మిస్డ్ కాల్ చేయడం తీవ్రమైన నేరంగా భావించి ఐపిసి సెక్షన్ 354 డీ 1, 2 కింద కేసులు నమోదు చేయనున్నట్లు బీహార్ రాష్ట్ర సీఐడీ ఇన్ స్పెక్టర్ (ఐజి) జనరల్ అరవింద్ పాండే హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఇది ఒకటి, రెండు సార్లవరకు పరిగణలోనికి తీసుకోకుండా, పదే పదే మిస్ట్ కాల్ చేయడం, వేధించడం లాంటివి ఉద్దేశపూర్వకంగా చేస్తే ఆయా సెక్షన్ల కింద కేసు నమోదుచేసి జైలుకు పంపనున్నట్లు పాండే తెలిపారు. రాష్ట్రంలో మహిళపై జరుతున్న నేరాలకు సంబంధించి మహిళా పోలీసు స్టేషన్లకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు రెండు రోజుల అవగాహన సదస్సును పలు పాఠశాలల్లో, కాలేజీలలో సిఐడి నిర్వహించింది. ఈ అవగాహన సదస్సులో పలువురు విద్యార్ధులు పాల్గొని ఆకతాయిలు కొంతమంది పదే పదే మిస్డ్ కాల్స్ చేస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఐడీ ఇన్ స్పెక్టర్ (ఐజి) జనరల్ అరవింద్ పాండే తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.