ముగిసిన కృష్ణానది బోర్డు సమావేశం

హైదరాబాద్, అక్టోబర్ 30: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం బోర్డు ప్రతికా ప్రకటన విడుదల చేసింది. శ్రీశైలం జలవివాదంపై ఎలాంటి నిర్ణయాన్ని బోర్డు వెలువరించలేదు. సమస్యను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎస్ లకు సూచించింది. తమ అభిప్రాయం త్వరలోనే తెలుపుతామని బోర్డు పేర్కొంది. ఎర్రమంజిల్ లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ రోజు ఉదయం రెండోసారి సమావేశమైంది. బుధవారం జరిగిన మొదటి సమావే:లో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఇవాళ పూర్తిస్థాయి సమావేశం జరిగింది. రెండు రాష్ర్టాల విద్యుత్, జల అవసరాలను కృష్ణాబోర్డు విన్నది. సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని బోర్డు చైర్మన్ పండిట్ తెలిపారు. సమస్య పరిష్కారించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కృష్ణాబోర్డు సూచన చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.