ముగిసిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

cm review

(పాత చిత్రం)

హైదరాబాద్, డిసెంబర్ 19: పార్లమెంట్ సెక్రటరీల నియామకానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం దాదాపు గంటపాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా పార్లమెంట్ సెక్రటరీల నియామకంపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చ సాగింది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, నియామకంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే నలుగురిని పార్లమెంట్ సెక్రటరీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్, కోవ లక్ష్మి, జలగం వెంకట్రావ్, దాస్యం వినయ్ భాస్కర్ లను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో ఇద్దరికి కూడ పార్లమెంట్ సెక్రటరీలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

జనవరి ఒకటవ తేదీని సెలవుగా దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో 10 కోట్లతో క్రిస్టియన్ భవన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అదే విధంగా వరంగల్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రహదారులు, భవనశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.