ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

ఢిల్లీ: మహరాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆదివారం సాయంత్రం జరిపిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో మహారాష్ట్ర, హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. హర్యానాలో సంపూర్ణ మెజారిటీ సాధించడంతో అక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతాపార్టీ సిద్ధమవుతోంది. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ జరిగింది. మహరాష్ట్రలో ఏ పార్టీ మద్దతు తీసుకోవాలన్న దానిపై బేటీలో చర్చ జరిగినట్లు తెలియవచ్చింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.