మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన కేసీఆర్

KCR-TRS

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం హన్మకొండ కోర్టుకు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కేసులో విచారణకు హాజరయ్యారు. పరకాల ఉప ఎన్నిక సందర్భంగా 2012 మే 20న ఆత్మకూరు ఎన్నికల సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ ఆయనపై కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ కోసం కేసీఆర్ హన్మకొండ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. కాగా విచారణ జూన్ 9కి వాయిదా పడింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.