మెట్రో అలైన్ మెంట్ మార్పుపై అఖిలపక్షం

kcr-27

హైదరాబాద్, నవంబర్ 27: మెట్రో అలైన్ మెంట్ మార్పుపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. మెట్రోఅలైన్ మెంట్ మార్పుపై వివరణ ఇస్తూ మూడు మార్పులు సూచించినట్లు ఆయన వెల్లడించారు. సుల్తాన్ బజార్ కు నష్టం వాటిల్లకుండా బడీచౌడీ నుంచి అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనక నుంచి మెట్రోలైన్ వేయవలసిందిగా సూచించామని ఆయన చెప్పారు. అఖిలపక్ష సమావేశం తరువాతే మెట్రో అలైన్ మెంట్ మార్పుపై నిర్ణయం తీసుకొంటామని ఆయన స్పష్టంచేశారు. దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, చారిత్రాత్మక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చూస్తామని ఆయన తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.