మెట్రో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై పరిశీలన

విజయవాడ, సెప్టెంబర్‌ 20 : ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలో నిర్మించనున్న మెట్రో రైలు మార్గం కోసం విజయవాడ, మంగళగిరిల్లో ఢిల్లీ మెట్రో నిర్మాణ రూప శిల్పి, ఆంధ్రప్రదేశ్‌ మెట్రో సలహాదారు శ్రీధరన్‌ పరిశీలన జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి దశ నిర్మాణంలో భాగంగా కానూరు ఇంజనీరింగ్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి రామవరప్పాడు మీదుగా జాతీయ రహదారి సుమారు 25 మీటర్ల వరకు మెట్రో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడి పరిస్థితులు, మార్గాలపై చర్చించామని చెప్పారు. మెట్రోపై పర్యావరణ పరమైన అంశాలను పరిశీలిస్తున్నామని శ్రీరధన్‌ అన్నారు.  ప్రతి కిలోమీటరకు ఒక మెట్రో స్టేషన్‌ ఉంటుందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారని శ్రీరధన్‌ చెప్పారు.  మెట్రోపై త్వరలో సమగ్ర పర్యావరణ నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. మెట్రోరైలు గుంటూరు వంటి ప్రాంతాలకు విస్తరించడం ఆర్థిక భారం అన్నారు. భౌగోళిక పరిస్థితులను కూడా పరిశీలించి అంచనాలను తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్మాణం ప్రారంభించవచ్చునని శ్రీధరన్ తెలిపారు .

Have something to add? Share it in the comments

Your email address will not be published.