మెదక్ సాగుకు… మంజీరా నీరు…

kcr-medak-17

హైదరాబాద్, డిసెంబర్ 17: మంజీరా నీటిని మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. కృష్ణా నది నీటిని హైదరాబాద్‌ తరలించి మంజీరా నీటిని మెదక్‌ జిల్లాలో వినియోగించాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. మంజీరా నీటిని సింగూర్‌ ప్రాజెక్టులో నిలువ చేసి, ఘనపూర్‌ ఆయకట్టు ద్వారా మెదక్‌ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరందించే విధంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

మెదక్‌ జిల్లా పుల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపుర్‌ ఆనకట్టను బుధవారం ముఖ్యమంత్రి సందర్శించారు.  నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఘనపూర్‌ ఆనకట్ట పైన, మంజీరా నది పొడవునా ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా ఘనపూర్‌ ఆనకట్టపై సమీక్ష చేశారు.

మంజీరా నది నుంచి 4.06 టి.ఎం.సి. ల నీటి కేటాయింపు ఘనపూర్‌ ఆనకట్టకు ఉందన్నారు. దీని ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందాలని, కాని ప్రస్తుతం 12 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ 25 వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరందించాలని, వీలయితే మరో 5 వేల ఎకరాలకు నీటి సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.