మెరుపు సమ్మెకు దిగిన పెట్రోల్ బంక్ డీలర్లు

Petrol-bunk

తూనికలు, కొలతల శాఖ వేదింపులకు నిరసనగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లు నిరవధికంగా మూసివేసినట్లు ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ వ్యాపారుల సమాఖ్య ప్రకటించింది. తూనికలు, కొలతల శాఖ తనిఖీలు ఆపే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెట్రోల్ బంక్ మిషన్ కొలతల్లో తేడాకు తాము ఎలా బాధ్యులం అవుతామని, కావాలని మాపై దాడులు చేస్తున్నారన్నారు.

ఆయిల్ కంపెనీల పరికరాల లోపంతో డీలర్లకు ఎలాంటి సంబంధం ఉండదని, అలాంటప్పుడు మమ్మల్ని వేదించడం దేనికని ఏదైనా వుంటే కంపెనీలను దోషులుగా నిలబెట్టాలని రాష్ట్ర పెట్రోలియం ట్రేడర్స్ సమాఖ్య అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. దీనిపై తూనికలు, కొలతల శాఖ కమీషనర్ ను కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.