మొక్కలతో 2015 కొత్త సంవత్సరానికి స్వాగతం

rjh-1

రాజమండ్రి,, జనవరి 1: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీలో ఏర్పాటుచేసిన నూతన వత్సర వేడుకలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశంలో పచ్చదనం-పరిశుభ్రత కోసం మోడీ ఇచ్చిన పిలుపు స్వచ్ఛభారత్ ను కడియం నర్సరీలు అందిపుచ్చుకున్నారు.

స్వచ్ఛభారత్ కు విస్తృత ప్రచారం కల్పించేందుకు కడియం నర్సరీ నిర్వాహకులు వేలాది మొక్కలతో 2015 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందమైన అలంకరణకు జీవపోశారు. ఎంతో ముచ్చటగొలిపే వీటిని సందర్శించేందుకు ప్రజలు ఎగబడ్డారు. నూతన సంవత్సరం ఒక రోజుతో కాకుండా వీటిని సంక్రాంతి వరకూ ఉండే విధంగా 20 మంది నైపుణ్యం గల కార్మికులు ఐదారు రోజులు కష్టపడి ఈ అలంకరణ చేశారు. ఇందుకు వేలాది రూపాయలు వ్యయం అయినా, ప్రతి ఏటా దేశానికి మేలు జరిగే విధంగా అనేక అంశాలుపై ఇలా మొక్కలు వినియోగించి అలంకరణలు చేస్తున్నామని, ఇదొక ఆనవాయితీ చేసుకున్నట్టు నర్సరీ రైతు పల్లా వెంకన్న వెంకటేష్ చెప్పారు. వీటి అలంకరణకు లక్షా ఆరు వేల మొక్కలను వినియోగించినట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా కడియంలోని సత్యదేవ నర్సరీలో కూడా మొక్కలతో స్వచ్యభారత్ పేరుతో న్యూ ఇయర్ అలంకరణ చేశారు. మోడీ పిలుపు స్వచ్చభారత్ అంశాన్ని ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఇలా చేశామని రైతు పుల్లా సత్యనారాయణ తెలిపారు.

కడియంలో నర్సరీ రైతులు పచ్చదనం – పర్యావరణం కాపాడాలనే సంకల్పంతో ప్రజలలో చైతన్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ రకరకాల పూలమొక్కలు, పూలుతో అలంకరించిన న్యూ ఇయర్ అలంకరణ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

-తేజ సౌజన్యంతో

Have something to add? Share it in the comments

Your email address will not be published.