మోడీని నరుకుతానన్న కాంగ్రెస్ నేత అరెస్ట్

Modi-imran-masood

బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ముక్కలు ముక్కలు చేస్తానంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ ను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. నిన్న ఓ సభలో మసూద్ మాట్లాడుతూ… ఉత్తరప్రదేశ్ ను గుజరాత్ లా చేస్తానన్న మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఇది గుజరాత్ కాదు అక్కడ ముస్లింలు 4 శాతమే ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు 42శాతంగా ఉన్నారు. చూస్తూ ఊరుకోం’ అంటూ మసూద్ వ్యాఖ్యానించారు. దీంతో సహరాన్ పూర్ పోలీసులు మసూద్ పై కేసు నమోదు చేసి ఈ రోజు తెల్లవారుజామున ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు మసూద్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.