మోడీ కావాలనుకుంటే టీస్టాల్ పెట్టిస్తాం: మణిశంకర్ అయ్యర్

mani-shankar-aiyer

ఢిల్లీలో ఏఐసీసీ సదస్సు వాడీవేడిగా జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఏఐసీసీని వేదికగా మలుచుకున్నారు.బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ ఎప్పటికీ దేశ ప్రధాని కాలేరని అన్నారు. ఆయన కోరుకుంటే సదస్సు జరుగుతున్న ప్రాంతంలో టీకొట్టు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని వ్యాఖ్యానించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.