మోదీకి సమన్లు జారీ చేసిన అమెరికా కోర్టు

హైదరాబాద్ : 2002 నాటి గోద్రా అల్లర్లను ఆపేందుకు విఫలమయ్యారనే నేపధ్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్రంలో అధికారం చెపట్టడానికి ముందు నరేంద్ర మోదీ గుజరాజ్ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు.

గుజరాత్ అల్లర నుంచి బయటపడిన ఇద్దరు వ్యక్తుల తరఫున అమెరికన్ జస్టిస్ సెంటర్ స్వచ్చంధ సంస్థ ఈ పిటీషన్ను దాఖలు చేసింది. దీని ఆధారంగా జారీ అయిన ఈ సమన్లకు మోదీ 21 రోజుల్లోగా తన స్పందనను తెలియజేయాల్సి ఉంది. నిర్ణీత వ్యవధిలో మోదీ స్పందించని పక్షంలో ఆయనను డిఫాల్టర్ గా ప్రకటించే అవకాశముందని ఆ సమన్లో కోర్టు వెల్లడించినట్టు తెలుస్తోంది.

ముస్లింలకు చెందిన అమాయక వ్యక్తులను, వికలాంగులను మట్టుబెట్టాలని ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని ఆ పీటిషనర్ పేర్కొన్నారు. మత స్వేచ్ఛను ఉల్లంఘించినందుకు 1998 యూ ఎస్ లా ప్రకారం 2005తో నరేంద్ర మోదీ కి అమెరికా వీసాను రద్దు చేసింది.

ఈ రోజు సాయంత్రం నరేంద్ర మోదీ న్యూయార్క్ వెళ్లి, అక్కడ యు ఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాను కలవడానికి వాషింగ్టన్ కు వెళ్లనున్నాను. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీ అమెరికా వెళ్లడం ఇదే ప్రథమం. భారత్, అమెరికాల మధ్య కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రకటించిన మోడీ, అమెరికా గడ్డపై కాలు మోపక ముందే ఈ సమన్లు జారీ కావడం విశేషం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.