మోహన్ బాబుతో వర్మ ‘ఒట్టు’

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు తొలిసారిగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ చిత్రంలో మోహన్ బాబుతో బాటు ఆయన తనయుడు విష్ణు యువ కథానాయకుడుగా నటిస్తాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును వర్మ ఇప్పటికే పూర్తి  చేశాడు.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాకి తాజాగా ‘ఒట్టు’ అనే టైటిల్ నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 26 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును నిర్వహిస్తారు. ఈ సినిమాలో మోహన్ బాబును, విష్ణులను వర్మ కొత్తగా ప్రెజంట్ చేస్తాడట.

Have something to add? Share it in the comments

Your email address will not be published.