మోహినీ అవతారంలో శ్రీవారు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు మోహినీ అవతారంలో తిరువీధుల్లో వూరేగారు. ఉదయం 9 గంటలకు ప్రత్యేక అలంకరణతో బంగారు కిరీటాన్ని అధిరోహించి భక్తులకు సాక్షాత్కరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీ కృష్ణస్వామి మరో పల్లకిపై వేంచేశారు. స్త్రీలు ధరించే అన్ని రకాల ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మోహినీ రూపంలో అభయహస్త ముద్రతో ఉంది. రెండు గంటలపాటు ఈ ఉత్సవం జరిగింది. రాత్రి 7.30 గంటలకు శ్రీవారి గరుడోత్సవం మొదలవుతుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.