యుపి రైలు ప్రమాదంలో ఐదుగురి మృతి

యుపి రైలు ప్రమాదంలో ఐదుగురి మృతి

హైదరాబాద్, డిసెంబర్ 4 : ఉత్తరప్రదేశ్ లోని మావ్ జిల్లాలో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మరణించారు. అన్ మాన్డ్ రైల్వే క్రాసింగ్ వద్ద ప్యాసెంజర్ రైలును స్కూలు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్దారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రిలో చేర్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి లక్ష రూపాయల వంతున పరిహారం చెల్లిస్తారు. ఈ ప్రమాదంపై శాఖాపరమైన దర్యాప్తు జరుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు ప్రమాదం పై మంత్రి సురేశ్ ప్రభు లోక్ సభలో ప్రకటన చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.