యువతిని భవనం పైనుంచి తోసేసిన ప్రియుడు

హైదరాబాద్, అక్టోబర్ 14: సికింద్రాబాద్ చిలకలగూడలో మంగళవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని భవనం పైనుంచి కిందకు తోసేసిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాలు.. కుత్బుల్లాపూర్ గాజుల రామారంకు చెందిన ఎండి సాజిద్ (27), చిలకలగూడకు చెందిన రూప (21) ల మధ్య గత కొంతకాలంగా ప్రేమవ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రూప జన్మదిన కార్యక్రమానికి వచ్చిన సాజిద్ ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం అతడు గమనించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో, సాజిద్ రూపను భవనం మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసినట్టు తెలుస్తోంది. బాధితురాలి తలకు తీవ్రమైన గాయమై, పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కొరకు సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.